పర్ణశాల

July 8, 2008

జ్ఞాపకాల్ని అక్షరబద్ధం చేద్దాం రండి !

Filed under: బ్లాగులు — kathimaheshkumar @ 8:49 am


ప్రియమైన బ్లాగరులారా, సాధారణంగా చావా కిరణ్ గారు బ్లాగుల్లో రాయవలసిన ‘ఈ పక్షం విషయం’ సూచించేవారు. కానీ ఈ సారి నాకు ఆ బాధ్యత ఇవ్వడం జరిగింది.

“Memory is a way of holding on to the things you love, the things you are, the things you never
want to lose”
అంటారు. అంటే, మననుండీ ఎప్పటికీ విడిపోని, కోల్పోని, ప్రియమైన గుర్తులే జ్ఞాపకాలు అని. ఎంత అందమైన ఆలోచన!

జ్ఞాపకాలే లేకపోతే మన జీవితం ఇంత అద్భుతంగా అనిపించేదా? అందుకే అనుకుంటా బహుశా, “A memory is what is left when something happens and does not completely unhappen” అంటారు. ప్రతి మనిషి జీవితంలో ఈ జ్ఞాపకాలుంటాయి. కొన్ని తీపి, కొన్ని చేదు, కొన్ని వగరు, కొన్ని అద్భుతం, కొన్ని అతిశయం మరికొన్ని ఆనందాన్ని తమలో ఇముడ్చుకుని మన హృదయాంతరాలల్లో నిక్షిప్తంగా ఉండిపోతాయి.

వాటిని తట్టిలేపుదాం… ఆకారాన్నిద్దాం…. అక్షరాల్లో ఇముడ్చుదాం…అందరితో పంచుకుందాం.

“Every man’s memory is his private literature” మన బ్లాగులు మన భావవ్యక్తీకరణ ప్రపంచాలే కనుక, మన జీవన సాహిత్యాన్ని మనదైన శైలిలో పంచుకుందాం.

అందుకే, ఈ పక్షం (15 రోజుల) విషయం “మర్చిపోలేని జ్ఞాపకాలు”. ఈ రోజు 8 జూలై నుండీ 23 జూలై వరకూ మనమన బ్లాగుల్లో ఈ విషయంపై టపాలు రాద్దాం. ఎక్కువ స్పందనను పొందిన టపాను ఉత్తమ టపాగా ఎంచి గౌరవిద్దాం.

————————————-

Theme: Banana Smoothie. Blog at WordPress.com.

Follow

Get every new post delivered to your Inbox.